సీఎంఆర్ సేకరణను వేగవంతం చెయ్యాలి: అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్

నల్లగొండ జిల్లా:ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు అప్పగించిన ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు.గురువారం సీఎంఆర్ అంశంపై మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో రైస్ మిల్లర్లతో మీటింగ్ నిర్వహించారు.

 Cmr Collection Should Be Speeded Up Additional Collector Srinivas , Additional C-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ పెండింగ్ కు గల కారణాలు,సేకరణ ప్రక్రియ ఆలస్యం వెనుక అధికారులకు మిల్లర్లకు మధ్య తలెత్తుతున్న సమస్యలపై సమీక్షించినట్లు చెప్పారు.ప్రభుత్వం విధించిన గడువులోగా సీఎంఆర్ ను పూర్తి చేయాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు.

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్,మిర్యాలగూడ ప్రెసిడెంట్ గౌరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి భోగవెల్లి వెంకటరమణ చౌదరి, ఆర్డీవో చెన్నయ్య,డీఎం నాగేశ్వరరావు,డీఎస్వో వెంకటేశ్వర్లు,సివిల్ సప్లై డిటి జావేద్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube