40 రోజులకు చేరుకున్న వీఆర్ఏల సమ్మె

నల్గొండ జిల్లా:పే స్కెల్,అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు తదితర న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రెవిన్యూ శాఖలోని వీఆర్ఏలు మొదలుపెట్టిన సమ్మె 40 వ,రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న వీఆర్ఏల నుద్దేశించి వీఆర్ఏల మండల అధ్యక్షులు పడాల లింగయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వెట్టి చాకిరి చేస్తూ ప్రభుత్వానికి అన్ని రకాల సేవలందిస్తున్న వీఆర్ఏ పట్ల ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపడం బాధాకరం అన్నారు.

 The Vra Strike Has Reached 40 Days-TeluguStop.com

నిరసన 40వ రోజుకు చేరినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరేతిన్నట్టు ప్రవర్తిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.రాబోయే రోజుల్లో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నిరసనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షలు వెంకటేశ్వర్లు,జిల్లా కో కన్వీనర్ రఫీ, మండలంలోని వీఆర్ఏ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube