పూరీలు బాగా పొంగి కరకరలాడుతూ ఉండాలంటే రెండు కప్పుల గోధుమపిండిలో రెండు
స్పూన్ల బొంబాయి రవ్వ కలపాలి.
నిమ్మకాయల నుండి రసం బాగా రావాలంటే ఒక మంచి చిట్కా ఉంది.
గోరువెచ్చని
నీటిలో నిమ్మకాయలను వేసి 15 నిమిషాల తర్వాత రసం తీస్తే బాగా రావటమే
కాకుండా సులువుగా రసం వస్తుంది.
పాలను కాచినప్పుడు పొంగటం సహజమే.
పాలు పొంగకుండా ఉండాలంటే పాలను
మరిగించినప్పుడు పాల గిన్నె మీద చెక్క గెరిటను పెడితే పాలు పొంగవు.
బెండకాయ ముక్కలను కోసినప్పుడు నైఫ్ కి జిగురు అంటుతూ ఉంటుంది.
ఆలా
అంటకుండా ఉండాలంటే బెండకాయలను కోసే నైఫ్ ని నిమ్మకాయతో రుద్ది కాటన్
క్లాత్ తో తుడిచి కొస్తే బెండకాయ జిగురు నైఫ్ కి అంటుకోకుండా ఉంటుంది.
నిమ్మకాయల నుండి రసాన్ని తీసేసాక నిమ్మతొక్కలను పాడేస్తూ ఉంటాం.
వాటిని
పాడేయకుండా నీటిలో నిమ్మకాయల తొక్కలను వేసి బాగా మరిగిస్తే మంచి సువాసన
వచ్చి రూమ్ ఫ్రెషనర్ గా పనిచేసి చెడు వాసన పోతుంది.
వంకాయ ముక్కలను కోసినప్పుడు తొందరగా నల్లబడుతూ ఉంటాయి.
ఆలా నల్లబడకుండా
ఉండాలంటే ఉప్పు కలిపిన నీటిలో వంకాయ ముక్కలను వేయాలి.
మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న పంచదారకు ఒక్కోసారి చీమలు పడుతూ ఉంటాయి.
ఆలా పట్టకుండా ఉండాలంటే పంచదార డబ్బాలో కొన్ని లవంగం మొగ్గలు వేయాలి.లవంగాలకు ఉండే ఘాటు కారణంగా చీమలు పంచదార డబ్బా వద్దకు చేరవు.
కాఫీ పొడి ఒక్కోసారి గడ్డ కడుతూ ఉంటుంది.ఆలా గడ్డకట్టకుండా ఉండాలంటే
కాఫీ పొడి డబ్బాలో బియ్యం మూటను వేస్తే తేమను పీల్చుకొని కాఫీ పొడి
గడ్డకట్టకుండా ఉంటుంది.
బొంబాయి రవ్వ తొందరగా పురుగు పెట్టేస్తూ ఉంటుంది.అందువల్ల మార్కెట్
నుంచి బొంబాయి రవ్వ తేగానే వేగించి గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే
పురుగు తొందరగా పట్టదు.
చపాతీ పిండి కలిపేటప్పుడు పిండిలో రెండు స్పూన్ల నూనెను వేసి కలిపితే చపాతీలు మృదువుగా మెత్తగా వస్తాయి.చపాతీలు కాల్చేటప్పుడు నూనె వేయవలసిన అవసరం ఉండదు.