సాధారణంగా వెండితెరపై ఎంతో మంది హీరోయిన్లు ఎంతో అందంగా ముద్దుగా కనపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.వారి అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం మార్కెట్లో లభించే వివిధ రకాల ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ వారి అందాన్ని పెంపొందించుకుంటారు.
అయితే చాలా మంది హీరోయిన్లు ఇలాంటి కెమికల్ ప్రొడక్ట్స్ కాకుండా సహజ సిద్ధంగానే కొన్ని పాత పద్ధతులను ఉపయోగిస్తూ వారి అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం కష్టపడుతుంటారు.అలాంటి వారిలో నటి రాశి ఖన్నా ఒకరు.
తెలుగు తమిళ చిత్రాలతో బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని తన అందం వెనుక దాగి ఉన్న సీక్రెట్ బయటపెట్టారు.సాధారణంగా హీరోయిన్ సీక్రెట్ తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు అయితే ఈ సందర్భంగా రాశి ఖన్నా బ్యూటీ సీక్రెట్ వెల్లడించడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను అందం కోసం ఎక్కువ ఖర్చు చేయనని తెలిపారు.

తన అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం తను పాత పద్ధతులను ఎక్కువగా ఉపయోగిస్తారని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.తన అందం కోసం పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ముల్తాని మట్టి, శనగపిండి, పెరుగు కలిపి రాసుకుంటానని ఇలా చేయడం వల్ల తన అందం రెట్టింపు అవుతుందని ఈ సందర్భంగా రాశి ఖన్నా తన అందం వెనుక దాగి ఉన్న సీక్రెట్ బయట పెట్టారు.