నల్లగొండ జిల్లా:ఈ నెల 24 నుంచి ప్రభుత్వ,ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.వేసవి సెలవులపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో
ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల జారీ చేసింది.జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని పేర్కొంది.అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే షెడ్యూల్ ను ఖరారు చేసినట్లు వెల్లడించింది.







