1.సమంత ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్

సినీనటి సమంత అనారోగ్యానికి గురి కావడంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు.సమంత తొందరగా కోలుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు.
2.రేవంత్ రెడ్డి ని పరుగులు పెట్టించిన రాహుల్
కాంగ్రెస్ కేలకనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర తెలంగాణలో జరుగుతోంది.ఈ సందర్భంగా రాహుల్ గాంధీ యాత్రలో పరుగులు పెడుతూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పరుగులు పెట్టించారు.
3.ఎస్ ఏ 1 పరీక్షల షెడ్యూల్ లో మార్పులు

ఎస్ ఏ 1 పరీక్షల షెడ్యూల్ లో మార్పులను విద్యాశాఖ చేపట్టింది.హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు నవంబర్ 9-16 తేదీల్లో ఎస్ ఏ 1 పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు.
4.నేడు చుందురులో కేసీఆర్ సభ
మునుగోడు నియోజకవర్గంలోని చుండూరులో ఈరోజు టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
5.నేడు రంగారెడ్డి జిల్లాలోకి రాహుల్ గాంధీ

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర ఈరోజు సాయంత్రం రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించనుంది.
6.ఎమ్మెల్యేలకు కొనుగోలు కేసుపై రేవంత్ కామెంట్స్
టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో జరిపించాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
7.48 గంటల పాటు ప్రచారం చేయవద్దు

మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రచార బాధ్యతలను చూస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి కి ఎన్నికల సంగం షాక్ ఇచ్చింది.48 గంటల పాటు ప్రచారం నిర్వహించరాదు అంటూ ఆయన పై నిషేధం విధించింది.
8.మోయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో నిందితులు జైలుకు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి పోలీసులు రిమాండ్ కు తరలించారు.
9.జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలోనే ఉంటున్నారు.ఈరోజు ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరుగుతుంది.
10.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.నిన్న తిరుమల శ్రీవారిని 84,878 మందు భక్తులు దర్శించుకున్నారు.
11.విజయ పాల ధర పెంపు
ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 1 నుంచి విజయ పాల ధరలు పెరుగుతున్నాయి .ఫుల్ క్రీం గోల్డ్ పాల ధర లీటర్ రెండు రూపాయలు చొప్పున పెంచుతున్నట్లు కృష్ణ మిల్క్ యూనియన్ ప్రకటించింది.
12.సిబిఐ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

సిపిఐ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో సీబీఐకి గతంలో దర్యాప్తు కోసం ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది.
13.కెసిఆర్ పై బండి సంజయ్ కామెంట్స్

మునుగోడు నియోజకవర్గానికి ఏమి చేయబోతున్నారు ? మునుగోడు గడ్డ పైన అడుగు పెడుతున్న సీఎం ఏమి చేస్తున్నారు చెప్పాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ ఉద్దేశించి విమర్శలు చేశారు.
14.కోయంబత్తూరు పేలుళ్ల కేసు ఎన్ఐఏకు అప్పగింత
కోయంబత్తూరులో కారులో సిలిండర్ పేలిన కేసు పత్రాలను ఎన్ఐఏకు అప్పగించినట్లు తమిళనాడు పోలీసులు తెలిపారు .
15.ఎంబిబిఎస్ తొలి విడత ప్రవేశాలు

తెలంగాణలోని వైద్య విద్య కోర్సు విద్యార్థులకు కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం శుభవార్త చెప్పింది.ఎంబిబిఎస్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
16.కంగనా రౌత్ ను బిజెపిలో చేర్చుకోవడంపై నడ్డా కామెంట్స్
బిజెపి అవకాశం కల్పిస్తే లోక్ సభ ఎంపీగా పోటీ చేస్తానని బాలీవుడ్ యాక్టర్ కంగనా రనౌత్ ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు.బిజెపిలోకి అందరికీ స్వాగతం పలుకుతామని కానీ సీట్ల కేటాయింపు విషయంలో ఎన్నికల ముందు సంప్రదింపుల ప్రక్రియ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని నడ్డా తెలిపారు.
17.తెనాలిలో పునీత్ రాజ్ కుమార్ విగ్రహం

దివంగత స్టార్ హీరో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి ఏడదైనా నేపథ్యంలో ఆయన అభిమానులు ఏపీలోని తెనాలిలో 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని సిద్ధం చేశారు.
18.పవన్ కళ్యాణ్ కామెంట్స్
ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు చెల్లవు , రౌడీలు రాజ్యాలు ఏలకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
19.ఏపీ ప్రభుత్వానికి గ్లోబల్ డిజిటల్ హెల్త్ అవార్డులు

ఏపీ ప్రభుత్వానికి గ్లోబల్ డిజిటల్ హెల్త్ అవార్డులు దక్కాయి ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని ఢిల్లీలో ఈ అవార్డులను అందుకున్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,750 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -51,000
.