ప్రస్తుత సమాజంలో ప్రజలు అర్ధరాత్రి వరకు పని చేసి అలసిపోయి ఇంటికి వచ్చి ఆహారం తిని నిద్రపోతున్నారు.కానీ ఈ పద్ధతి అసలు సరైనది కాదు.
ఆధునిక జీవనశైలి వల్ల మధుమేహం( Diabetes ), రక్తపోటు, ఉబకాయం, గుండె జబ్బులు మొదలైన వ్యాధులు పెరిగిపోతున్నాయి. రాత్రిపూట భోజనం చేయడం ఎలాగైనా హానికరమే అని నిపుణులు చెబుతున్నారు.
దీనిపై రాత్రి భోజనం చేసిన తర్వాత ప్రజలు చాలా తప్పులు చేస్తున్నారు.ఇది మరింత ఇబ్బందిని పెంచుతూ ఉంటుంది.
అటువంటి పరిస్థితిలో రాత్రిపూట భోజనం చేసిన తర్వాత మీరు ఏ తప్పులు చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే అర్థ రాత్రి భోజనం చేయడం అస్సలు మంచిది కాదు.ఇలా చేయడం వల్ల శరీరంలోనీ అనేక రకాల హార్మోన్లలో మార్పులు సంభవిస్తాయి.ఇవి మన శరీరం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
ఈ పరిస్థితిలో రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ముందుగా జీర్ణ క్రియ( Digestion ) చెడిపోతుంది.ఇంకా చెప్పాలంటే తిన్న వెంటనే చాలామంది నిద్రపోతున్నారు. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్ర పోవడం అసలు మంచిది కాదుదీనివల్ల ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన ఎంజైములు విడుదల కాకుండా అనేక రకాల సమస్యలు వస్తాయి.

అందుకే రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు.కాసేపు తిరగడానికి ప్రయత్నించాలి.ఇంకా చెప్పాలంటే ప్రస్తుత రోజులలో రాత్రి పడుకునే ముందు బెడ్ పై మొబైల్ చూడాని వారు అస్సలు ఉండరు.
కానీ రాత్రి పూట ఎలాంటి స్క్రీన్ టైం అయినా శరీరానికి ఎంతో హానికరం.నిద్రపోయేటప్పుడు మొబైల్ స్క్రీన్( Mobile Phone Screen ) నీ కళ్ళ ముందు ఉంచుకోగానే మన బయోలాజికల్ క్లాక్‌లో డిస్టర్బెన్స్‌లు మొదలవుతాయి.
ఇంకా చెప్పాలంటే రాత్రి భోజనం చేసిన తర్వాత పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని దాదాపు చాలామందికి తెలుసు.