నల్లగొండ జిల్లా: మాడుగులపల్లి మండలం పాములపహాడ్ గ్రామంలోని ఐకెపి కేంద్రంలో శనివారం ఉదయం ధాన్యం బస్తాలను లారీలో లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బస్తాలు కూలి అదే గ్రామానికి చెందిన హమాలీలు ఏర్పుల లింగయ్య,గండమల్ల కృష్ణయ్య,బొల్లెద్దు వెంకన్న అనే ముగ్గురు హామాలీలకు తీవ్ర గాయాలయ్యాయి.గండమల్ల కృష్ణయ్య లారీ పై నుండి కింద పడడంతో క్రింద లారీ వద్దకు ధాన్యం బస్తాలను మోసుకొస్తున్న లింగయ్య,వెంకన్నలపై బస్తాలు ఒక్కసారిగా పడడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
మిగతా హమాలీలు వెంటనే గమనించి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్ సహాయంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.







