నల్లగొండ జిల్లా:మునుగోడు మండలం గూడపూరు వద్ద పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు.చండూరు మండలం బీమనపల్లికి చెందిన నరసింహ తన TS07GY 7383 కారులో రూ.13 లక్షలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.హైదరాబాద్ లో ప్లాట్ అమ్మగా వచ్చిన డబ్బును, పండగకు సొంత ఇంటికి వస్తూ తీసుకువచ్చానని, మళ్లీ ఆ డబ్బును హైదరాబాద్ కు తీసుకువెళుతున్నానని నరసింహ చెబుతున్నారు.
ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ పోలీసులు చేస్తున్నారు.