ఎర్రచెరుతండా పోడు భూముల్లో ఉద్రిక్తత

నల్లగొండ జిల్లా:పోడు భూముల్లో మొక్కలు నాటేందుకెళ్లిన అటవీశాఖ అధికారులు.అడ్డగించి, వేసిన మొక్కలను ధ్వంసం చేసిన గిరిజనులు.

 Tension In Erracherutanda Waste Lands-TeluguStop.com

అధికారుల వాహనాలను అడ్డుకొని ఘెరావ్.వెనుదిరిగిన అటవీశాఖ అధికారులు.

తిరుమలగిరి సాగర్ మండలం ఎర్రచెరుతండాలో ఆదివారం పోడు భూముల్లో మొక్కలు నాటేందుకెళ్లిన అటవీ శాఖ అధికారులకు గిరిజన రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు నాటిన మొక్కలను గిరిజనులు ధ్వంసం చేసి,అధికారుల వాహనాలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

పోడుభూముల్లో అడుగు పెడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తూ ఘెరావ్ చేయడంతో చేసేదిలేక అటవీశాఖ అధికారులు అక్కడి నుండి వెనుదిరిగి వెళ్లిపోయారు.అనంతరం గిరిజన రైతులు మాట్లాడుతూ పోడు భూముల్లో అడుగుపెడితే బరాబర్ అడ్డుకుంటామని తేల్చిచెప్పారు.

శతాబ్దాలుగా అడవిని నమ్ముకొని బ్రతికే అడవిబిడ్డలం,ఇప్పుడు వెళ్ళిపొమ్మంటే ఎక్కడికెళ్లాలని ప్రశ్నించారు.అటవీశాఖ అధికారులు మమ్ములను రెచ్చగొడుతున్నారని,పోడు భూములకు పట్టాలిస్తానన్న ముఖ్యమంత్రి మాటలు ఏమయ్యాయని నిలదీశారు.

ఉప ఎన్నికల్లో కూర్చివేసుకొని పట్టాలిస్తామని సీఎం కేసీఆర్ చెప్పింది నిజం కాదా? అప్పుడు ఓట్ల కోసం పట్టాలిస్తామని హామీ ఇచ్చి,ఓట్లు వేసి గెలిపిస్తే ఇప్పుడు భూముల్లోకి రావద్దంటూ నిర్బంధాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.గిరిజన రైతులను అడవికి దూరం చేసే కుట్రలను సహించేది లేదని, పోడు భూముల కోసం ప్రాణ త్యాగాలు చేయడానికి కూడా వెనుకాడబోమని,అడవి మా కన్నతల్లిలాంటిది, దాన్ని నుండి దూరం చేయాలని చూస్తే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube