నేటి తరానికి తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పాలి

నల్లగొండ జిల్లా: తెలుగు భాష ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటి చెప్పాలని తిరుమలగిరి(సాగర్)మండల నోడల్ అధికారి కొనమంచిలి శ్రీనివాస్ అన్నారు.బుధవారం నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రంలోని అల్వాల ప్రాథమికోన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాపోలు పరమేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

 The Superiority Of Telugu Language Should Be Shown To Todays Generation, Telugu-TeluguStop.com

ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిధిగా హాజరై కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ కవితలు, రచనలు చేయడం ద్వారా మాతృ భాషను సుసంపన్నం చేసుకోవచ్చన్నారు.

ఏ ప్రాంతానికైనా ఆ ప్రాంత సంస్కృతే మూలాధారం, ఆ సంస్కృతికి మూలం అక్కడి మాతృభాష అని అన్నారు.

మాతృభాషలో పట్టుంటేనే అన్నిరంగాల్లో రాణించవచ్చని, మాతృభాషను ఎవరూ విస్మరించకూడదని, అమ్మలాంటి కమ్మనైన మాతృబాషను మరువొద్దని,ప్రపంచంలోని ఏ భాషనైనా తనలో ఇముడ్చుకొగల శక్తి తెలుగు భాషకు మాత్రమే ఉన్నదన్నారు.విద్యార్థులు మాతృభాషపై మక్కువను పెంచుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాపని బాలకృష్ణ,విజయలక్ష్మి, లింగమ్మ,గౌస్ బాబా, నరేష్,లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube