దశాబ్ది సన్నాహాల్లో గులాబీ దండు ప్లెక్సీ వార్...!

నల్లగొండ జిల్లా

:తెలంగాణ రాష్ట్రావతరణ ఉత్సవాల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోసన్నాహాలు చేస్తున్నారు.దశాబ్ది ఉత్సవాల ప్రచారంలో భాగంగా ప్రధాన రహదారిపై పురపాలక సంఘం ఆధ్వర్యంలో భారీ స్వాగత ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

 Guklabi Gard Plexi War In Decade Preparations Details, District News,telugu Dist-TeluguStop.com

ఇందులో సీఎం కేసీఆర్( CM KCR ), మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిలతో( KCR, Jagadish reddy ) పాటు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి( Kancharla Bhupal reddy ) ఫోటోలను పెట్టారు.జిల్లా కేంద్రంలో అధికారికంగా జరిగే దశాబ్ది ఉత్సవాల్లో జాతీయ పతాకావిష్కరణ చేయనున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి( Gutha Sukender Reddy ) ఫోటో మాత్రం ప్రధాన ఫ్లెక్సీలో పెట్టకపోవడం బీఆర్ఎస్ లో అంతర్గత వర్గపోరు బహిర్గతం అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కేవలం ప్రధాన ఫ్లెక్సికి అనుబంధంగా ఉన్న చిన్న రోడ్ సైడ్ ఫ్లెక్సీలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటోను కౌన్సిలర్లతో కలిపి పెట్టగా, దానిని సైతం ప్రధాన ఫ్లెక్సీ క్లాత్ తో కనిపించకుండా ఏర్పాటు చేయడంతో గుత్తా వర్గీయులకు ఆగ్రహం తెప్పించింది.

కనీసం శాసనమండలి చైర్మన్ ప్రోటోకాల్ సైతం పురపాలక సంఘం పాటించకుండా గుత్తాను అవమానించేలా రూపొందించిన ఫ్లెక్సీ వెనుక స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఒత్తిడే కారణమంటూ గుత్తా వర్గీయులు ఆరోపిస్తున్నారు.

గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి కంచర్లకు పోటీగా నల్గొండ ( Nalgonda )నుండి రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే మున్సిపాలిటీ స్వాగత ఫ్లెక్సీలో సుఖేందర్ రెడ్డి ఫోటోను కనిపించకుండా చేశారని గుత్తా వర్గీయులు మండిపడుతున్నారు.

ఒకవైపు జిల్లా కేంద్రంలో అధికారికంగా జరిగే అధికారిక ఉత్సవాల్లో మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డియే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న వేళ రేగిన ఈ ఫ్లెక్సీ వివాదం ఉత్సవాల పైన,పార్టీ కార్యక్రమాలపైన ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతోందోనన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

గత శ్రీరామనవమి వేడుకల్లోనూ నల్లగొండ రామాలయం ఫ్లెక్సీలలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో పెట్టకపోవడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.మరోవైపు పురపాలక సంఘం స్వాగత ఫ్లెక్సీకి కొద్ది దూరంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన గుత్తా అమిత్ రెడ్డి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల ప్లెక్సీలో మాత్రం ఎమ్మెల్యే కంచర్ల ఫోటో ఏర్పాటు చేయడం గమనార్హం.

ఇటీవల గుత్తా అమిత్ రెడ్డి నల్గొండ సెగ్మెంట్లో తన కార్యకలాపాలు ముమ్మరం చేయడం సహజంగానే సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్లలో అసహనాన్ని రగిలించిందని అంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సన్నాహాల సమీక్ష పేరుతో గుత్తా సుఖేందర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సహా ఇతర జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

తదుపరి రోజునే కలెక్టరేట్ లో కంచర్ల భూపాల్ రెడ్డి సైతం అధికారులతో సమీక్ష చేశారు.ఇదే రోజు ఉత్సవాల జిల్లా నోడల్ అధికారి,పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో మరొక సమీక్ష నిర్వహించారు.

పోటాపోటీ సమీక్షలతో అధికారులు సైతం అసహనానికి గురవుతున్నారు.రేపటి నుండి 21 రోజులపాటు రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరుపుకోవాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం జిల్లా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేపట్టింది.

ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేటలో జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, నల్లగొండలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డిలు జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube