నల్గొండ జిల్లా:దేవరకొండ మండలంలోని అచ్చమ్మకుంట తాండాకు చెందిన నేనావత్ నాఖ్య (35)కడుపునొప్పితో బాధపడుతూ చికిత్స నిమిత్తం ఆదివారం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి రాగా అందుబాటులో వైద్యులు లేకపోవడంతో సమయానికి చికిత్స అందక మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగుచూసింది.నఖ్యా మద్యానికి బానిస కావడంతో మద్యం మాన్పించడానికి కుటుంబ సభ్యులు ఏదో పసరు మందు తాగించారని సమాచారం.
అది వికటించి కడుపులో వపరీతమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు.కానీ,సమయానికి వైద్యులు ఎవరూ లేకపోవడం,ఉన్న సిబ్బంది పట్టించుకోని సరైన చికిత్స అందించకపోవడంతో నాఖ్య మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.
మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి బాధితులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
దీనితో ఆసుపత్రి ముందు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.