క్షణాల్లో కుప్పకూలిన పంప్‌హౌస్‌ రక్షణ గోడ..పసిగట్టని అధికారులు...!

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్( Nagarjuna Sagar ) దగ్గర నిర్మిస్తున్న సుంకిశాల పంప్ హౌజ్ లోకి సొరంగంలోని నీరు రాకుండా నిర్మించిన రిటైనింగ్ వాల్ కుప్పకూలింది.ప్రమాద సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

 The Protective Wall Of The Pump House Collapsed In Moments The Officials, Nagar-TeluguStop.com

జరిగిన భారీ ప్రమాదాన్ని బయటకు పొక్కకుండా జలమండలి అధికారులు గుట్టుగా దాచిపెట్టిన విషయం గురువారం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ ( Hyderabad )తాగునీటి అవసరాలు తీర్చడం కోసం నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సమీపంలో సుంకిశాల పంప్ హౌజ్ నిర్మాణం చేపట్టారు.

సొరంగంలోకి సాగర్ జలాలు రాకుండా రక్షణ కోసం రిటైనింగ్ వాల్ నిర్మించారు.ఇటీవల నాగార్జున సాగర్ కు భారీ వరద వచ్చి చేరడంతో రక్షణ గోడ ఒత్తిడికి గురై ఒక్కసారిగా కుప్పకూలింది.

దీనికి సంబందించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో చక్కర్లు కొడుతున్నాయి.పంప్ హౌజ్ నిర్మాణంలో షిఫ్ట్ కు వందమందికి పైగా మూడు షిఫ్ట్ లలో కార్మికులు పని చేస్తుంటారు.

ఘటన జరిగిన సమయంలో కూలీలు షిఫ్ట్ మారడానికి వెళ్లడంతో ఘోర ప్రమాదం తప్పింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాటి సీఎం చంద్రబాబు నాయడు 2001 లో ఈ పథకాన్ని పక్కన పెట్టి పుట్టంగండి ఏఎంఆర్ ప్రాజెక్టు (ఎలిమనేటి మాధవరెడ్డి ప్రాజెక్టు)నుంచి నీరు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చారు.

వాస్తవానికి ఎలిమనేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎంఆర్పీ) నల్గొండ జిల్లా రైతులకు సాగునీరు, తాగునీరు అందించే ప్రాజెక్టు.కానీ,ఇదే కాల్వల నుంచి హైదరాబాద్ అవసరాల కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం కోదండాపూర్ వద్ద నీటిశుద్ది ప్లాంట్ ఏర్పాటు చేసి హైదరాబాద్ మహానగరానికి తాగునీటినితరలిస్తున్నారు.

అయితే,పుట్టంగడి నుంచి తాగునీటిని తీసుకోవాలంటే నాగార్జు సాగర్ లో కనీసం 510 అడుగుల నీటిమట్టం ఉండాలి.

ఇంత కంటే నీటిమట్టం తగ్గితే అత్యవసర మోటార్లు ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోసుకుని తీసుకోవాల్సి వస్తుంది.దీని కోసం హైదరాబాద్ జల మండలికి ప్రతీ ఏటా రూ.6 కోట్లు ఖర్చు అవుతుంది.ఈ సమస్యలన్నింటినికీ చరమగీతం పాడి హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాల కోసమే ప్రత్యేకంగా సుంకిశాల ప్రాజెక్టును మొదలు పెట్టారు.సుంకిశాల ప్రాజెక్టుకు 1980లోనే అంకురార్పణ జరిగినా అది ముందకు పడలేదు.రెండేళ్ల కిందట ఎట్టకేలకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రూ.1450 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టినా, ఇపుడా అంచనా వ్యయం రూ.2,215 కోట్లకు పెరిగింది.నాగార్జునసాగర్ జలాశయంలో నీరు 462 అడుగుల కనీస నీటిమట్టానికి చేరుకున్నా సుంకిశాల నుంచి ఎలాంటి సమస్య లేకుండా తాగునీటిని తీసుకోవచ్చు.

సాగర్ జలాశయం నుంచి తీసుకునే నీటి కోసం మూడు సొరంగాల నిర్మాణం,సొరంగాల ద్వారా వచ్చే నీటిని తోడిపోయడానికి ఇన్ టైక్ వెల్ నిర్మించి అక్కడి నుంచి ఎత్తిపోయాల్సి ఉంది.కానీ,తాజాగా జరిగిన సంఘటనలో సుంకిశాల ఇన్ టేక్ వెల్ నిర్మాణంలో రక్షణ గోడ(రిటైనింగ్ వాల్) కూలిపోయింది.

దీంతో సర్జ్ పూల్ పూర్తిగా కృష్ణా నీటితో నిండిపోయింది.ఈ పనులు తిరిగి మొదలు కావాలంటే నాగార్జున సాగర్ లో తిరిగి నీటిమట్టం కనీస స్థాయికి పడిపోవాలి.

ఇంత పెద్ద ప్రమాదాన్ని బయటకు రాకుండా చేసిన వైనంపై సోషల్ మీడియాలో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube