కారును ఢీకొన్న బస్సు ముగ్గురు మృతి

నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా ఆమనగల్లు మండలం రాంనూతల శివారు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నల్లగొండ జిల్లా,ఆమనగల్లు మండలం, రాంనూతల శివారు వద్ద హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టిన సంఘటనలో

 Bus Collides With Car Three Killed, Bus Collides Car, Three Killed, Nalgonda Dis-TeluguStop.com

కారులో ప్రయాణిస్తున్న హస్తినాపురం ద్వారకానగర్ కు చెందిన బండారి శివకృష్ణ వరప్రసాద్ గౌడ్,నాంపల్లి మండలం రాందాస్ తండాకు చెందిన మేఘావత్ నిఖిల్(26), బైరామల్ గూడకు చెందిన బొర్ర మణిదీప్ గౌడ్ (25) అనే ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు.

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube