కారును ఢీకొన్న బస్సు ముగ్గురు మృతి

నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా ఆమనగల్లు మండలం రాంనూతల శివారు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.నల్లగొండ జిల్లా,ఆమనగల్లు మండలం, రాంనూతల శివారు వద్ద హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టిన సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న హస్తినాపురం ద్వారకానగర్ కు చెందిన బండారి శివకృష్ణ వరప్రసాద్ గౌడ్,నాంపల్లి మండలం రాందాస్ తండాకు చెందిన మేఘావత్ నిఖిల్(26), బైరామల్ గూడకు చెందిన బొర్ర మణిదీప్ గౌడ్ (25) అనే ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు.

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.

మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కొరియన్, మలయాళం భాషల్లో అనర్గళంగా మాట్లాడేస్తున్న ఎన్నారై బాలుడు..?