నల్లగొండ జిల్లా: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆదేశాల మేరకు బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సామాజిక న్యాయ యాత్ర శనివారం నల్గొండకు చేరుకుంది.
వారికి బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం తెలిపి,బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభల్లో బీసీల డిమాండ్లు సాధించాలని,అన్ని రాజకీయ పార్టీలు బీసీల జనాభా తమాషా ప్రకారం సీట్లను కేటాయించాలని,
లేనియెడల బీసీల సత్తా ఏందో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో చూపిస్తామని అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ,నీలం వెంకటేష్,బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి,యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కారింగ్ నరేష్ గౌడ్,విద్యార్థి సంఘం నాయకుడు కొంపల్లి రామన్న గౌడ్,శివకృష్ణ,పొగాకు రవికుమార్ యాదవ్,నిమ్మను కోటి,శివకుమార్,పనస శ్రీకాంత్,కళ్యాణి,మనీషా,లక్ష్మి, ప్రసన్న,మహాలక్ష్మి,మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.