నల్లగొండ జిల్లా: ఆడపిల్లల లోటు సమాజానికి చేటని, సమాజంలో స్త్రీ, పురుషులు సమానమని, వారి మధ్య వివక్షత చూపకూడదని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డి.ఎ.కొండల్ రావు అన్నారు.గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలియగానే కొన్ని కుటుంబాలు గర్భస్రావానికి సిద్ధపడుతున్నారని,గర్భస్రావం చేయడం చట్టరిత్య నేరమన్నారు.
జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లలో డెకాయ్ ఆపరేషన్లు చేసి పుట్టబోయేది ఆడపిల్ల అని చెప్పే స్కానింగ్ సెంటర్ల మరియు
అందుకు సహకరించే వ్యక్తులపై గర్భస్త పిండ పరీక్ష ప్రక్రియ నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటమన్నారు.ఈ దురాచార నిర్మూలనకై ప్రతి పౌరుడు అవగాహన పెంచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గైనకాలజీ జనరల్ హాస్పిటల్ హెచ్ఓడి డా.స్వరూపరాణి, గైనకాలజీ డా.సుచరిత, పిడియాషియన్ డా.యాదయ్య,పిఓఎంసిహెచ్ డా.అరుంధతి, ఏపీఆర్ఓ శ్రీహరిప్రసాద్, డిపిఓ ఉమామహేశ్వరి పాల్గొన్నారు.