నకిరేకల్ మండలం వల్లభాపురం గ్రామంలో వీధి కుక్కల స్వైర విహారంతో తిర్పరి నాగరాజు అనే రైతుకు చెందిన 26 మేక పిల్లలు మృత్యువాత పడిన ఘటన బుధవారం వెలుగు చూసింది.బాధిత రైతు తెలిపన వివరాల ప్రకారం.
గ్రామ శివారులోని తన వ్యవసాయం పొలం వద్ద పశువుల షెడ్డులో మేకలను ఉంచాడు.ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున మేకలపై కుక్కలు దాడి చేయడంతో 26 మేక పిల్లలు మృత్యువాత పడ్డాయి.
వాటి విలువ దాదాపు మూడు లక్షల రూపాయల వరకు ఉంటుందని,కుక్కల దాడిలో జరిగిన నష్టాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు.అయితే విషయం తెలుసుకున్న రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమేట్ల బాలరాజు యాదవ్ తనకు ఫోన్ చేసి తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారని నాగరాజు చెప్పారు.