నల్గొండ జిల్లా:దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు రోజు మాదిరిగానే ఉదయం పొలానికి వెళ్ళగా పంట పొలంలో 20 లక్షల రూపాయల విలువైన 500 రూపాయల నోట్ల కట్టలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.వెంటనే తేరుకొని పక్కన ఉన్న ఇతర రైతులకు విషయం చెప్పి చూపించగా వాటిపై చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉండటంతో దొంగ నోట్లుగా గుర్తించారు.
వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేయగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 500 రూపాయల నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు.ఇది పక్కా దొంగనోట్లు ముద్రించేవారి పనేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.







