నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ 210 బీటెక్,2 ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ కాలేజీలకు ప్రభుత్వం ఫీజులు ఖరారు చేసింది.అత్యధికంగా రూ.1.05 లక్షలు,అత్యల్పంగా రూ.40 వేల చొప్పున ఫీజును నిర్ణయించింది.ట్యూషన్, అఫిలియేషన్,మెడికల్,గేమ్స్ ఇతర ఖర్చులు ఇందులోకే వస్తాయి.
వసతి,రవాణా,మెస్, రిఫండబుల్ ఇతర ఫీజులు వీటిలో చేర్చలేదు.అదనంగా వసూలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది.