సూర్యాపేట జిల్లా:హైదరాబాద్ నుండి విజయవాడ వైపు శ్రీ ఆర్ కె ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కి సడన్ గా ఫిట్స్ రావడంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్లలోకి దూసుకెళ్లిన ఘటన సోమవారం ఉదయం సూర్యాపేట రూరల్ మండలంటేకుమట్ల వద్ద 65వ జాతీయ రహదారిపై జరిగింది.ఆ సమయంలో బస్సులో 10 మంది ప్రయాణికులు ఉన్నట్లు,అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తుంది.
ఎలాంటి ప్రాణ నష్టం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నా రు.ఘటనా స్థలానికి చేరుకున్న సూర్యాపేట రూరల్ పోలీసులు క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.