రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టక విసిగిపోతున్నారా.. అయితే మీ సమస్యకు ఇదే పరిష్కారం!

మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అతి ముఖ్యమైన వాటిలో నిద్ర( sleep ) ఒకటి.ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలి అంటే కచ్చితంగా కంటి నిండా నిద్ర ఉండాల్సిందే.

 This Magical Drink Will Cure Insomnia Naturally! Insomnia, Sleeping Problems, Sl-TeluguStop.com

కానీ ఇటీవల రోజుల్లో చాలా మంది కంటికి కునుకు కరువవుతోంది.రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టక కోట్లాది మంది సతమతం అవుతున్నారు.

నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల విసిగిపోతుంటారు.అలసట, చిరాకు, ఒత్తిడి, తలనొప్పి వంటివి విపరీతంగా విధిస్తాయి.

క్రమంగా అధిక బరువు, మధుమేహం, గుండెపోటు( Weight, diabetes, heart attack ) వంటి ప్రమాదకరమైన సమస్యలకు దారితీస్తుంది.

అందుకే రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తుంటారు.

అయితే ప్రశాంతమైన నిద్రను అందించడానికి కొన్ని కొన్ని పానీయాలు చాలా అద్భుతంగా సహాయపడతాయి.ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ కూడా ఆ కోవకే చెందుతుంది.సరిగ్గా నిద్ర పట్టక సతమతం అవుతున్న వారు నిత్యం ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ‌ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్న పదండి.

Telugu Tips, Healthy, Insomnia Cure, Latest, Sleep Drinks, Problems, Magicalcure

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆర్గానిక్ పసుపు( Organic turmeric ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం పొడి,( ginger powder ) హాఫ్‌ టేబుల్ స్పూన్ మిరియాల పొడి( Pepper powder ), హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి( Cinnamon powder ) వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక గ్లాస్ లో పావు టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పొడి మరియు హాట్ వాటర్ వేసుకుని బాగా కలిపితే మన డ్రింక్ అనేది సిద్ధమవుతుంది.

Telugu Tips, Healthy, Insomnia Cure, Latest, Sleep Drinks, Problems, Magicalcure

నిత్యం నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ డ్రింక్ ను సేవించాలి.ఇది నిద్ర హార్మోన్లను ప్రభావితం చేస్తుంది.ప్రశాంతమైన సుఖమైన నిద్ర ను అందిస్తుంది.నిద్ర నాణ్యతను పెంచుతుంది.నిద్రలేమితో బాధపడుతున్న వారికి ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది.పైగా ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

పొట్ట‌ చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

రక్తం శుద్ధి అవుతుంది.మరియు అధిక బరువు సమస్య నుంచి సైతం బయట పడతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube