నల్లగొండ పార్లమెంట్ పరిధిలో మహిళా ఓటర్లదే పై చెయ్యి

నల్లగొండ జిల్లా:ఈ నెల 13 న జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో పరిధిలో మొత్తం ఓట్లు 17,18,954 ఉన్నాయి.అందులో పురుషులు 8,42,247,మహిళలు 8,76,538,ఇతరుల ఓట్లు 169 ఉన్నాయి.

 The Above Is For Women Voters In Nalgonda Parliament , Nalgonda Parliament, Wo-TeluguStop.com

పురుషులకంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.ఈ పార్లమెంటు నియోజక వర్గ పరిధిలో దేవరకొండ,నాగార్జునసాగర్,మిర్యాలగూడ, హుజూర్ నగర్,కోదాడ,సూర్యాపేట,నల్గొండ ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి.

నియోజకవర్గాలుగా పోలింగ్ కేంద్రాలు,ఓటర్ల గణాంకాలు పరిశీలిస్తే… దేవరకొండ నియోజకవర్గంలో 328 పోలింగ్ స్టేషన్లు, పురుషుల ఓట్లు 1,31,599, మహిళ ఓట్లు 1,30,241, ఇతరులు 18 ఓట్లు కాగా మొత్తం 2,61,858 ఓట్లు ఉన్నాయి.నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్‌లు 306, పురుషుల ఓట్లు 1,15,545,మహిళా ఓటర్లు 1,20,229,ఇతర ఓట్లు 21 ఉన్నాయి.

మొత్తం ఓట్లు 2,35,795 ఉన్నాయి.మిర్యాలగూడలో పోలింగ్ స్టేషన్లు 264,పురుషుల ఓట్లు 1,15,352,మహిళా ఒట్లు 1,19,956,ఇతరుల ఓట్లు 26 ఉండగా మొత్తం 2,35,334 ఓట్లు ఉన్నాయి.

హుజుర్ నగర్ నియోజకవర్గంలో 308 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.పురుషుల ఓట్లు 1,20,556, మహిళా ఓటర్లు 1,27,109, ఇతరుల ఓట్లు 57 ఉండగా మొత్తం 2,47,722 ఓట్లున్నాయి.

కోదాడ నియోజకవర్గంలో 296 పోలింగ్ స్టేషన్లు ఉండగా, పురుషుల ఓట్లు 1,21,390, మహిళా ఓట్లు1,28,692, ఇతరుల ఓట్లు 17 కాగా మొత్తం 2,50,099 ఓట్లున్నాయి.సూర్యాపేట నియోజకవర్గంలో 271 పోలింగ్ స్టేషన్‌లు ఉండగా, పురుషుల ఓట్లు 1,19,295, మహిళా ఓట్లు 1,25,889, ఇతరుల ఓట్లు 17ఉన్నా యి.మొత్తం ఓట్లు 2,45,201 ఉన్నాయి.నల్లగొండ నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్లు 288 ఉన్నాయి.

పురుషుల ఓట్లు 1,18,510, మహిళా ఓట్లు 1,24,422, ఇతరుల ఓట్లు 13ఉన్నాయి.మొత్తం 2,42,945 ఓట్లున్నాయి.

నల్గొండ పార్లమెంట్ పరిధిలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 17,18,954 ఓట్లు ఉండగా అందులో పురుషుల ఓట్లు 8,42,247 కాగా,మహిళా ఓట్లు 876538 ఉన్నాయి.

అయితే మొత్తంగా మహిళా ఓట్లు 34,291 అధికంగా ఉన్నాయి.మొత్తం ఏడు నియోజకవర్గాలలో దేవరకొండ నియోజకవర్గం తప్ప మిగతా ఆరింటిలోనూ మహిళా ఓట్లే అధికం.

ఇది ఇలా ఉంటే 2019 ఎన్నికలలో నల్గొండపార్లమెంట్ పరిధిలో 15,85,980 లక్షల ఓట్లు ఉండేవి.అయితే ప్రస్తుత ఎన్నికలకు అదనంగా 1,32,974 ఓట్లు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

పెరిగిన ఓట్లలో కూడా దాదాపు 50%శాతం మహిళల ఓట్లే ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube