రేపే మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్

నల్లగొండ జిల్లా:భారత ఎన్నికల సంఘం, న్యూఢిల్లీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం,93-మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 3న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.ఈవిఎమ్ లలో భద్ర పరచబడిన ఓటర్ల నిర్ణయాన్ని తెలిపే ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8.00 గంటల నుండి ప్రారంభమవుతుంది.నవంబర్ 3 న జరిగిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ లో నియోజకవర్గంలోని మొత్తం 241805 ఓటర్లకు గాను,93.13% తో మొత్తం 2,25,192 ఓట్లు ఈవిఎంలలో పోలవగా,80+ వృద్దులు మరియు దివ్యాంగుల నుండి మొత్తం 739 పోస్టల్ బ్యాలెట్ కి ధరకాస్తులు వస్తే అందులో 686 మంది పోస్టల్ బాల్లెట్ వినియోగించుకున్నారు.నవంబర్ 4 న సాయుధ బలగాలకు (సర్వీస్ ఓటర్స్) సంబంధించి పోస్టల్ బ్యాలట్స్ 50కి గాను 6 అందినవి.

 The By-election Counting Is The Day Before Tomorrow-TeluguStop.com

ఈ మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియకు నల్గొండలోని అర్జాల బావిలోని తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది.

పోల్ చేయబడిన ఈవీఎంలను ఏ మరియు బి కేటగిరీ ఉన్న స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు.రేపు ఉదయం 7.30 గంటలకు ఎన్నికల కమీషన్ పరిశీలకులు,పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ఎలక్షన్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ లు తెరవబడుతాయి.కమిషన్ సూచనల మేరకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపడతారు.

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం మొత్తం 2 టేబుల్స్ ఏర్పాటు చేయబడ్డాయి.పోస్టల్ బ్యాలెట్‌తో పాటు సర్వీస్ ఓటర్ల ఓట్లను ఎన్నికల కమీషన్ యొక్క ఈటీపీబీఎస్ సాఫ్టువేర్ ద్వారా లెక్కింపు కూడా చేపడతారు.8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు చేపట్టనున్నారు.ఓట్ల కౌంటింగ్ మొత్తం 21 టేబుల్ లను కమిషన్ ఆమోదంతో ఏర్పాటు చేయబడ్డాయి.మొత్తం 298 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.ఓట్ల లెక్కింపు మొత్తం 21 టేబుల్లలో మొత్తం 14 రౌండ్లు (14 పూర్తి రౌండ్లు, 294 పోలింగ్ స్టేషన్లు) మరియు 15వ రౌండ్ 4 టేబుల్లలో జరుగుతుంది.ఈవీఎం కౌంటింగ్ పూర్తయిన తర్వాత,ఎన్నికల నిబంధనావలి 1961 యొక్క నియమం 56 (D) ప్రకారం లెక్కించుటకు అనుమతించిన మరియు కంట్రోల్ యూనిట్ ఫలితాన్ని ప్రదర్శించని పోలింగ్ స్టేషన్‌లను మినహాయించి డ్రా పద్దతి ద్వారా తప్పనిసరిగా 5 పోలింగ్ స్టేషన్ల వివి ప్యాట్ ల స్లిప్‌లను విసీబి (వివి ప్యాట్ కౌంటింగ్ బూత్) నందు లెక్కించబడును.150 మంది సీటింగ్ కెపాసిటీతో ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా రెండింటికీ ప్రత్యేక హాలు ఏర్పాటు చేయబడింది.ఓట్ల లెక్కింపు రోజు కోసం మొత్తం 250 మంది సిబ్బందిని నియమించటమైనది.

వారిలో 100 మంది సిబ్బందిని కేవలం ఓట్ల లెక్కింపు కోసం మరియు 150 మంది సిబ్బందిని ఇతర కార్యకలాపాల కోసం నియమించటమైనది.మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్ నిర్వహించనున్న నల్గొండ పట్టణంలోని అర్జాల బావి రాష్ట్ర గిడ్డంగుల కేంద్రంలో శనివారం కౌంటింగ్ సిబ్బందికి కౌంటింగ్ రిహార్సల్ నిర్వహించారు.

సాధారణ పరిశీలకులు పంకజ్ కుమార్,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి కౌంటింగ్ సిబ్బందికి,అధికారులకు కౌంటింగ్ నిర్వహణపై సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు,రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్,నల్గొండ అర్.డి.ఓ.జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube