ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పోలీసు సురక్షా దివాస్ ర్యాలీలు...!

నల్లగొండ జిల్లా: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను ప్రజలకు వివరించేందుకు పలు కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రాల్లో ఫుట్‌ పెట్రోలింగ్‌,బైక్‌ రాల్యీలు,పెట్రోలింగ్‌ కార్లు‌, బ్లూ క్లోట్స్‌,ఫైర్‌ వెహికిల్స్‌ తో జిల్లా సురక్షా ర్యాలీలు బోనాలు,డప్పులు, కళాకారుల ఆటపాటలతో ఉత్సాహంగా నిర్వహించారు.

 Police Safety Diwas Rallies Across Nalgonda District, Police Safety Diwas , Nalg-TeluguStop.com

సూర్యాపేట జిల్లాలో…

జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పోలీస్ సురక్షా ర్యాలీని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించి మాట్లడుతూతెలంగాణాలోనే ఫ్రెండ్లి పోలీసింగ్ అమలు జరుగుతుందని,షి టీమ్స్ తో మహిళలకు సంపూర్ణ రక్షణ కలిపిస్తున్న రాష్ట్రంగా తెలంగాణా ఘనతి కెక్కిందన్నారు.సూర్యాపేట డిఎస్పి నాగభూషణం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్,బొల్లం మల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,జడ్ పి వైస్ చైర్మన్ వెంకట నారాయణ గౌడ్, కలెక్టర్ ఎస్.వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్, డిఎస్పిలు వెంకటేశ్వరరెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లాలో…

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకల సందర్భంగా నల్లగొండ ఎస్పీ అపూర్వారావు ఆధ్వర్యంలో పోలీసు దివాస్ సురక్షా ర్యాలీ నిర్వహించారు.నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించగా జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయం నుండి హైదరాబాద్ రోడ్లోని మర్రిగూడ క్రాస్ రోడ్ వరకు భారీగా వాహన ర్యాలీ కొనసాగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి,జిల్లా పరిషత్ చైర్మన్ నరేందర్ రెడ్డి,పలువురు రాజకీయ ప్రముఖులు,పోలీసు అధికారులు,సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సురక్షా దివాస్ ర్యాలీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని డీసీపీ రాజేష్ చంద్ర జెండా ఊపి ప్రారంభించారు.భువనగిరి పట్టణంలో కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో పోలీసులు జాతీయ జెండాను ప్రదర్శించారు.కలెక్టరెట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన అమవీరుల కుటుంబాలను కలెక్టర్, డీసీపీ సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు,సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube