జూనియర్ ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్.. ఇదే మొదటిసారి?

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా తాత చరిష్మా ఉన్న మానవడిగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.ఇక ఆ తర్వాత తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు.

 Jr Ntr Double Hatrick Back To Back , Rajamouli , Jr.ntr, Rrr, Janatha Garage, Ja-TeluguStop.com

అంతేకాదు ఇక చిన్న వయసులోనే మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాతో మొదటి సారి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఒక్కసారిగా సింహాద్రి ఆది లాంటి సినిమాలతో మాస్ ప్రేక్షకుల అందరి చూపులు తన వైపుకు తిప్పుకున్నాడు.

యమదొంగ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి యమదొంగ లాంటి సినిమాలు ఇక దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించాడు అన్న విషయం తెలిసిందే.

ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాలుగవ సారి రాజమౌళి తో కలిసి త్రిబుల్ ఆర్ సినిమాలో నటించాడు.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ లో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి రామ్ చరణ్ కూడా నటించాడు.

ఈ సినిమాలో స్వతంత్ర సమర యోధుడు కొమరంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించాడు అన్న విషయం తెలిసిందే.పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25వ తేదీన విడుదల అయింది.

బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రికార్డులు బద్దలు కొడుతుంది.

Telugu Jai Lavakusa, Janatha Garage, Jr Ntr, Jrntr, Rajamouli, Simhadri, Tollywo

ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్.అయితే ఇటీవలే త్రిబుల్ ఆర్ విజయంతో వరుసగా ఆరో విజయాన్ని సాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు జూనియర్ ఎన్టీఆర్.2015లో టెంపర్, 2016లో నాన్నకు ప్రేమతో, అదే సంవత్సరంలో జనతా గ్యారేజ్, ఇక 2017లో జై లవకుశ, 2018లో అరవింద సమేత సినిమాలతో వరుస విజయాలు అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుని హిట్టు కొట్టాడు.ఎన్టీఆర్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా వరుసగా ఆరు విజయాలతో వార్తల్లో నిలిచాడు ఈ నందమూరి హీరో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube