నల్లగొండ జిల్లా:బహుజన విప్లవ వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజు 372 జయంతి వేడుకలను గౌడ యువత ఆధ్వర్యంలో స్థానిక మిర్యాలగూడ పట్టణంలోని సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు.ఆయన విగ్రహనికి పూలమాల వేసి ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా పాపన్న గౌడ్ జయంతిని నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.అదే విధంగా సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజు విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలని ప్రభుత్వాని కోరారు.
ఈ కార్యక్రమంలో అనంతు కరుణాకర్ గౌడ్,చిత్రియాల అజయ్, మట్టపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.