నల్లగొండ జిల్లా:త్రిపురారం మండలం బెజ్జికల్ గ్రామానికి చెందిన కందుకూరి పాపయ్యకు చెందిన ఇల్లు సోమవారంవిద్యుత్ సర్క్యూట్( Electric circuit )తో దగ్ధమైంది.రోజు వారీ కూలి పనులు చేసుకునే నిరుపేద కుటుంబం,పోషణ కోసం దాచిపెట్టినకున్న ఆహార ధాన్యాలు,నిత్యావసరాల వస్తువులు,ఇంటి సామగ్రి మొత్తం కాలి బూడిదై రోడ్డున పడింది.
రోజూ మాదిరిగానే కుటుంబ సభ్యులు కూలి పనికి వెళ్ళిన తర్వాత విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి.స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఫైర్ వాహనం వచ్చేలోపే మంటల్లో రూ.10వేల నగదు, బట్టలు,సామాగ్రి కాలిపోయాయని అశోక్ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.సుమారు 10 లక్షలకు పైగానే నష్టం వాటిల్లిందని,తమ పరిస్థితిని,జరిగిన నష్టాన్ని పరిశీలించి నష్టపరిహారం( Compensation ) అందించి ఆదుకోవాలని బాధితుడు అధికారులను వేడుకున్నారు.