కన్నుల పండుగగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం

నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలో ప్రకాశం బజార్ లోని శ్రీ సీతారామచంద్ర ఆలయంలో స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా,అత్యంత శోభాయమానంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా నల్లగొండ అడిషనల్ ఎస్పీ మనోహర్ హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 Marriage Of Sri Sitaramachandra Swamy As A Festival Of The Eyes-TeluguStop.com

అనంతరం జగిని దంత వైద్యశాల మరియు శ్రీ జగిని టెక్స్ టైల్స్ వారు సంయుక్త ఆధ్వర్యంలో పదిహేను వందల మందికి ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్బంగా జగిని వెంకన్న మాట్లాడుతూ గత 22 సంవత్సరాల నుండి శ్రీ రామనవమి జరుపుకుంటున్నామని,ఈ సంవత్సరం ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీఐలు ఆదిరెడ్డి,కృష్ణారావు, ఆర్ఐలు,ఎస్ఐలు,కమిటీ సభ్యులు గార్లపాటి గిరి,శ్రీను,మల్లేష్,పాండు,జగిని మధు,శ్రీనివాస్, చంటి,హరినాథ్,చంద్రం,వ్యాపారస్థులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube