Acne removal Skin Care: ఒక్క రాత్రిలో మొటిమలను తగ్గించే మ్యాజికల్ రెమెడీ మీకోసం!

చంద్రబింబం లాంటి ముఖాన్ని ఒక చిన్న మొటిమ ఎంతలా పాడు చేస్తుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.అందుకే ముఖంపై మొటిమలు వచ్చాయంటే చాలు తెగ బాధపడిపోతూ ఉంటారు.

 A Magical Remedy To Reduce Acne In One Night Is For You! Magical Remedy, Acne, R-TeluguStop.com

అందులోనూ ఏదైనా ఫంక్షన్, పెళ్లి, మీటింగ్ వంటివి ఉంటే ఇంకా హైరానా పడిపోతుంటారు.ఎందుకంటే మొటిమలు అందాన్ని మాత్రమే కాదు తమలోని మనోధైర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తాయి.

అందుకే మొటిమలు వచ్చాయంటే వాటిని త్వరగా తగ్గించుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజిక‌ల్‌ రెమెడీని కనుక పాటిస్తే కేవలం ఒక్క రాత్రిలోనే మొటిమలు తగ్గుముఖం పడతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ రెమెడీ ఏంటి.? అనేది తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకోవాలి.ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలు, హాఫ్ టేబుల్ స్పూన్ తేనె, నాలుగు చుక్కలు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు స్పూన్ తో మిక్స్ చేయాలి.నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే పూర్తిగా తొలగించి వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

ఆపై తయారు చేసుకున్న మిశ్రమాన్ని మొటిమలు ఉన్నచోట మాత్రమే కాకుండా ముఖం మొత్తానికి అప్లై చేసుకుని పూర్తిగా ఆరిన తర్వాత నిద్రించాలి.

Telugu Acne, Acneremoval, Tips, Magical Remedy, Reduce Acne, Skin Care, Skin Car

మరుసటి రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా క‌నుక‌ చేస్తే మొటిమలు దెబ్బకు పరార్ అవుతాయి.అదే సమయంలో ముఖం కాంతివంతంగా మరియు ఆకర్షణీయంగా మారుతుంది.

డల్‌ స్కిన్ దూరం అవుతుంది.చర్మంపై ఏమైనా మురికి, మృత కణాలు ఉంటే తొలగిపోతాయి.

ఇక ఈ రెమెడీని రెగ్యులర్ గా కనుక వాడితే మొటిమల తాలూకు మచ్చలు సైతం క్రమంగా మాయం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube