నల్లగొండ జిల్లా:చింతపల్లి మండలం గడియగౌరారం రైతుల,ప్రజల పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది.గడియగౌరారం పరిధిలోని బోరబండ వద్ద గల వికాస్ హర్వెంచర్ కోళ్లఫామ్ యజమాని తన ఫామ్ లో చనిపోయిన కోళ్లను నిర్లక్ష్యంగా పంట పొలాల్లో వేయడంతో వాటిని తిన్న కుక్కలు రైతులు, గ్రామ ప్రజలపై దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెల్లవారుజామున పొలాల్లోకి వెళ్లాలంటే రైతులు భయబ్రాంతులకు గురవుతున్నామని,జనసంచారం లేనిచోట చచ్చిన కోళ్లను ఖననం చేయాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పడేయడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, వాటి నుండి దుర్వాసన వస్తుందని,వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతధికారులు స్పందించి కోళ్ల పారం యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని, ఓపెన్ గా పడవేసిన కోళ్ల కళేబరాలను భూమిలో సమాధి చేయాలని కోరుతున్నారు.