నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన రైతు తాను సాగు చేసిన వరి పంట కోత దశకు చేరుకున్న తరుణంలో పంటకి అవసరమైన నీరు లేకపోవడంతో చూస్తూ ఊరుకోలేక వాటర్ ట్యాంకర్ సహాయంతో వరి పంటకు నీరందిస్తూ పంటను కాపాడెందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు.భూగర్భ జలాలు తగ్గిపోవడంతో మొన్నటి వరకు పుష్కలంగా నీరు పోసిన వ్యవసాయ బోర్లు ఒక్కసారిగా తగ్గిపోవడంతో ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట కళ్ళ ముందే ఎండిపోతుంటే భరించలేక కష్టాలు పడుతున్నారు.
ఒకపక్క విద్యుత్ కోతలు మరో పక్క భూగర్భ జలాలు అడుగంటడంతో తీరా చేతికొచ్చిన పంట చేతికి వస్తుందో లేదోనని రైతులు ఆవేదన చెందుతున్నారు.ప్రభుత్వ పెద్దలు,అధికారులు తక్షణమే స్పందించి నాగార్జునసాగర్ ఎడమ కాలువకు పది రోజులు నీటిని విడుదల చేసి చేతికొచ్చిన పంట పొలాలను కాపాడాలని పలువురు రైతులు కోరుతున్నారు.