గుడ్ న్యూస్ చెప్పిన సందీప్ వంగ.. అర్జున్ రెడ్డిని మరోసారి చూడొచ్చట.. గెట్ రెడీ!

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికి తెలుసు.ఈయన సెన్సేషనల్ హీరో అవడానికి కారణం అర్జున్ రెడ్డి సినిమా అనే విషయం తెలిసిందే.

 Arjun Reddy Raw Version Ready, Arjun Reddy, Raw Version, Vijay Deverakonda, Sand-TeluguStop.com

ఈ సినిమా తోనే విజయ్ ఇప్పుడు స్టార్ హీరోగా మారి మిలియన్ ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.విజయ్ కెరీర్ అర్జున్ రెడ్డి కి ముందు అర్జున్ రెడ్డి తర్వాత అన్నట్టు ఉంటుంది.

ఎందుకంటే అప్పటి వరకు ఈయన చిన్న హీరో మాత్రమే.కానీ ఈ సినిమా రిలీజ్ తర్వాత ఈయన పేరు ఇండస్ట్రీ మొత్తం మారుమోగి పోయింది.సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో ఘాటు రొమాన్స్ తో పాటు లిప్ కిస్ లు లాంటివి ఉండడమే కాదు.భగ్న ప్రేమికుడిగా ఈయనను చూపించిన విధానం అందరిని కట్టిపడేసింది.

ఈ సినిమాపై ముందు ఎన్ని వివాదాలు చెలరేగిన రిలీజ్ తర్వాత అవన్నీ ఈ సినిమా రికార్డులలో కొట్టుకు పోయాయి.

ఇంతటి హిట్ సినిమా గురించి డైరెక్టర్ సందీప్ వంగ తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వార్త చెప్పాడు.తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి చెబుతూ.”అర్జున్ రెడ్డి సినిమా మొత్తం కూడా 4 గంటల 20 నిముషాలు వచ్చింది.కానీ అంత ఎక్కువ రన్ టైం ఉంటే ప్రేక్షకులు చూడలేరని.రా వెర్షన్ ను ఎడిట్ చేసాం.అయినా కూడా 3 గంటల 40 నిముషాలు అయ్యింది.అయితే అది కూడా రిలీజ్ చేయడం కష్టం అని మరొక 40 నిముషాలు కుదించి ఈ సినిమాను చివరకు 3 గంటల నిడివితో రిలీజ్ చేసాం.

Telugu Arjun Reddy, Arjunreddy, Raw, Sandeepreddy-Movie

ఇక అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యి 5 ఏళ్ళు అవుతున్న క్రమంలో ఈ సినిమా రా వెర్షన్ మొత్తాన్ని రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నాం.ఎడిట్ చేయకుండా సినిమా మొత్తాన్ని మరొకసారి చూడవచ్చు” అంటూ చెప్పుకొచ్చాడు.దీంతో విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ రా వెర్షన్ లో రొమాన్స్ అంతకు మించి ఉందనున్నట్టు తెలియడంతో ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube