అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి

నల్లగొండ జిల్లా: గుర్రంపోడు మండలం కోయిగురోనిబావి గ్రామంలో ఆదివారం జరిగిన అగ్నప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలను సోమవారం నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి పరామర్శించారు.ఈ సదర్భంగా ప్రమాద బాధితులకు ఆర్ధిక సాయం అందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నుండి తగు సాయం అందే విధంగా చూస్తానని,పూర్తిగా ఇండ్లు కాలిపోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ మొదటి విడతలో ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

 Mla Jaiveer Reddy Visited The Families Of Fire Victims, Mla Jaiveer Reddy , Fire-TeluguStop.com

ప్రమాద తీవ్రతను,అందుకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జి.కిరణ్ కుమార్,డిటి పరీరుద్దిన్, ఆర్ఐ మురళి కృష, జూనియర్ అసిస్టెంట్ కిషన్,గ్రామ కార్యదర్శి క్రాంతి కుమార్,జడ్పీటిసి గాలి రవికుమార్,మాజీ ఎంపిపి చనమళ్ల జగదీష్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ సూదిని జగదీష్ రెడ్డి, కంచర్ల విజయేందర్ రెడ్డి, చందర్ రావు,వెళ్ళ కృష్ణయ్య,శ్రీకాంత్ రావు, యూత్ అధ్యక్షుడు కమతం జగదీష్ రెడ్డి,ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేడి వెంకన్న,ఓబీసీ సెల్ అధ్యక్షుడు కొత్త నాగరాజు తదతరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube