జగదీష్ రెడ్డీ... 420 పై బహిరంగ చర్చకు సిద్ధమా: వేముల వీరేశం

నల్లగొండ జిల్లా: రాష్ట ప్రజల దీవెనలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే 2 స్కీమ్స్ అమలు చేశామని,మిగతా 5 గ్యారంటీల కొరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగుస్తుందని,ఈ నెల రోజుల లోపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ప్రభుత్వం పైన బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు కేటీఆర్,హరీష్ రావు, కడియం శ్రీహరి,పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఫైరయ్యారు.శనివారం నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాలువ నిర్మాణం కోసం బినామీలకు కాంట్రాక్టు ఇప్పించుకొని

 Nakirekal Mla Vemula Veeresham Fires On Brs Mlas, Nakirekal ,mla Vemula Veeresha-TeluguStop.com

ఈ ప్రాంత ప్రజలకు నీళ్లు ఇవ్వకుండా మోసం చేసినందుకు 420 అనాలా? కేటీఆర్, నువ్వు నకిరేకల్ పట్టణంలో శంకుస్థాపనాలు చేసిన పనుల్లో జరిగిన అవినీతికి మిమ్ముల్ని 420 లు అనాలా? దీనిపైన బహిరంగ చర్చకు సిద్ధమా? నకిరేకల్ నియోజకవర్గంలో ఒక్క ఎకరం భూమికి నీరు సరఫరా అందించినట్లు ఉంటే నిరూపించు,లేదంటే ఇద్దరం రాజీనామా చేసి ప్రజా తీర్పును కోరుదాం అంటూ సవాల్ విసిరారు.ప్రభుత్వం పైన ఆరోపణలు చేసే నైతిక అర్హత నీకు లేదు జగదీష్ రెడ్డి, గత ప్రభుత్వంలో నీవు చేపట్టిన శాఖపై అసెంబ్లీ సాక్షిగా జ్యుడిషయరీ ఎంక్వైరీ వేయమని నువ్వే అన్నావు కదా?

నీ కోరిక మేరకు మా ప్రభుత్వం ఎంక్వైరీ వేపిస్తామని చెప్పగానే దోషిగా నిర్ధారణ అవుతానేమోనని ప్రభుత్వం పైన అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నావని,గతంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని హామీలు ఇచ్చవో ప్రతి ఉపన్యాస ఆధారాలతో సహా నేను వస్తా అప్పుడు 420 ఎవరో ప్రజలే నిర్ణయిస్తారని తేల్చి చెప్పారు.ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తొమ్మిదేళ్లు అవకాశం ఇచ్చినా ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, కొత్త పెన్షన్స్, కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా కాలయాపన చేశారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపైన జగదీష్ రెడ్డి మాట్లాడిన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube