విశాఖలో బొమ్మ తుపాకీతో ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న రౌడీ షీటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఆతనితో పాటు మరికొందరు అనుచరుల పై కూడా కేసు నమోదు చేశారు… విశాఖలోని వన్టౌన్ ప్రాంతానికి చెందిన ధోనీ సతీష్ ఆలియాస్ గసగసాలు కొందరితో కలిసి బొమ్మ తుపాకీతో బెదిరించి డబ్బులు గుంజుతున్నాడు.
ఫిర్యాదు ఇస్తే దాడులకు పాల్పడ్డాతారని ఎవరు ఫిర్యాదు చేయలేదు.కానీ ఓ కేసు విచారణలో విషయం బయటపడడంతో సతీష్ కోసం పోలీసులు గాలించారు.
అరకు నుంచి విశాఖ వస్తుండగా ఆనందపురం వద్ద అతన్ని అరెస్ట్ చేశారు.అతనితోపాటు త్రీటౌన్ పరిధిలోని గుర్రాల సాయి అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
వీరి నుంచి 50 వేల నగదు బొమ్మ తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్స్ ఏసీపీ త్రినాధ రావు తెలిపారు.