జిల్లా జైలును సందర్శించి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!

నల్లగొండ జిల్లా:ఖైదీలలో నైపుణ్యాలు అభివృద్ధి చేయటం ద్వారా ఉపాధి కల్పించే మార్గాలపై ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి జైలు అధికారులను ఆదేశించారు.

 District Collector Visited And Inspected The District Jail , District Collector-TeluguStop.com

నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా ఖారాగారాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఖారాగారంలోని అన్ని బ్యారెక్స్,వంటగది, స్టోర్ రూమ్,టాయిలెట్స్, కిచెన్,నర్సరీ,ఖార్ఖానా, మహిళ,పురుష బ్యారక్స్ అన్నింటిని తిరిగి,ఖైదీలకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించి,వంట సామగ్రిని తనిఖీ చేశారు.

వివిధ రకాల నేరాలపై జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఇస్తున్న వైద్య సదుపాయాలన్నింటిని తనిఖీ చేయడమే కాకుండా,కొంత మంది ఖైదీలతో ముఖాముఖి మాట్లాడారు.క్షణికావేశంలో తప్పుచేసి జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలు జైలు జీవితం అనంతరం పూర్తిగా మారిపోయి మంచిగా బతకాలని చెప్పారు.

గంజాయి, ఫోక్సో,దొంగతనం కేసులలో నిందితులుగా జైలుకు వచ్చిన వారితో ఆయన మాట్లాడుతూ గంజాయి లాంటి మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల పూర్తిగా మెదడును పనిచేయకుండా పోతుందని,గంజాయి వల్ల ఎలాంటి లాభం ఉండదని, గంజాయి తీసుకున్న తర్వాత మనిషికి జంతువుకు తేడా లేకుండా పోతుందన్నారు.అందువల్ల యువత అలాంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా దూరంగా ఉండాలని కోరారు.

జైలు జీవితం తర్వాత ప్రతి ఖైదీ మారాల్సిన అవసరం ఉందన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ జైలు సూపరింటెండెంట్ గదిలో సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు.

వివిధ నేరాలు చేసి జైలుకు వచ్చిన ఖైదీలు మళ్ళీ తప్పులు చేయకుండా మారే విధంగా వారికి కౌన్సిలింగ్ ఇయ్యాల్సిన అవసరం ఉందని,తప్పు చేయడం వల్ల కలిగే అనర్ధాలపై కౌన్సిలింగ్ ఇవ్వాలని,మరోకసారి తిరిగి వారు జైలుకు రాకుండా చూడాలని,వారి జీవితంలో పూర్తిగా మార్పు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని,ఇందుకు గాను తగిన ఏర్పాట్లు చేయాలని,అంతేకాకుండా జైలులోని ఖైదీలందరికి నైపుణ్యాలు అభివృద్ధిపరిచి స్వయం ఉపాధి కల్పించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు.స్కిల్ డెవలప్మెంట్ కింద ఇంకా ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందో ఆలోచించాలని,గంజాయి కేసులు ఎక్కువగా వస్తున్నాయని తెలుసుకొని జిల్లాలో అలాంటి కేసులు జరగకుండా,అలాగే ఫోక్సొ కేసులు జరగకుండా ఖైదీలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

జిల్లా జైలు ఇన్చార్జి సూపరింటెండెంట్ అనిల్ కుమార్,డిప్యూటీ జైలర్లు ఎం.నరేష్, వై.వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube