సర్పంచ్‍ల పదవీకాలం మరో 23 రోజులే...!

నల్లగొండ జిల్లా: రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ల పదవీకాలం జనవరి 31 తో ముగియనుంది.ఇంకా 23 రోజులే ఉండడంతో చేసిన పనుల పెండింగ్ బిల్లులు రాక ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ లు అయోమయంలో పడ్డారు.

 The Tenure Of Sarpanchs Is Only 23 More Days, Sarpanchs , Sarpanchs Tenure, Gra-TeluguStop.com

కొత్తగా ఏర్పడిన సర్కార్ వారి బాధను అర్దం చేసుకొని పెండింగ్ బిల్లులు చెల్లుస్తుందా లేదా అని ఎదురుచూస్తున్నారు.షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 1 వరకు కొత్త పాలకవర్గం గ్రామాల్లో కొలువుతీరాలి.

కానీ,ఇప్పటి వరకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాకపోవడంతో అసలు పంచాయితీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా వాయిదా పడతాయా అనే సందిగ్ధంలో ఉన్నారు.ప్రభుత్వం ఎన్నికల జరిపి కొత్త సర్పంచ్ లు వచ్చే అవకాశం ఉంటుంది.

లేకుంటే కార్యదర్శులే ఇంఛార్జీలు వ్యవహరిస్తారు.ఏం జరగబోతోంది అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.

అయితే పదవీ కాలం దగ్గర పడడంతో చాలా మంది సర్పంచులు పెండింగ్ బిల్లులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రం నుంచి వచ్చే ఫైనాన్స్ కమిషన్ నిధులు గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బంది జీతాలు,ఖర్చులకే సరిపోతున్నాయని వాపోతున్నారు.గత ప్రభుత్వంలోనే ఒక్కో సర్పంచ్ కు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షలకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని,గతంలో బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని,ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

రైతు వేదికలు,వైకుంఠ ధామాలు,డంపింగ్ యార్డులను అధికారులు సర్పంచలపై ఒత్తిడి తెచ్చి మరి నిర్మింపజేసారని, ఒక్కో రైతు వేదికను రూ.22 లక్షల అంచనా వ్యయంతో నిర్మించగా ఇందులో రూ.12 లక్షలు ఉపాధి హామీ నిధుల నుంచి ఖర్చు చేయగా, మిగతా రూ.10 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు.ఉపాధి హామీ నిధులు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు మాత్రం ఇప్పటివరకు రాలేదని జిల్లాలో ఇప్పటివరకు సర్పంచుల్లో ఎక్కువ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారని, అయినా వారికి బిల్లులు రాలేదని,ఇప్పుడొచ్చిన కొత్త ప్రభుత్వం అందరినీ ఆదుకోవాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube