నల్లగొండ జిల్లా:భార్య భర్తల మధ్య ఏర్పడిన చిన్నపాటి గొడవతో ఏడేళ్ల కూతురును తీసుకొని ఓ మహిళ ఇంటి నుండి వెళ్లిపోయిన సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఊట్కూరులో వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే…ఊట్కూరు గ్రామం ఎస్సీ కులానికి చెందిన జెర్రిపోతుల ఝాన్సీ (28),భర్త నరసింహ ఇటీవల పత్తి పంట విషయంలో చిన్నపాటి తగువు పెట్టుకున్నారు.
గత శనివారం తన బర్త నరసింహ ఉదయం కూలిపనికి వెళ్ళగా సాయంత్రం 4 గంటల సమయంలో తన చిన్న కూతురు జెర్రిపోతుల త్రీజ (7) తీసుకొని ఐకెపి సెంటర్ కు వెళ్తున్నానని పక్కయింటి వాళ్ళకి చెప్పి ఇంటి నుండి వెళ్ళిపోయింది.తిరిగి రాకపోవడం,ఫోను కూడా స్విచ్ ఆఫ్ రావడంతో బంధువుల,తెలిసిన వారి ఆరా తీయగా ఆచూకీ దొరకపోవడంతో గురువారం భర్త జెర్రిపోతుల నరసింహ నిడమనూరు పోలీసులను ఆశ్రయించారు.
భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్సై గోపాలరావు తెలిపారు.