నల్లగొండ జిల్లా:వెలిమినేడులోని 200 అసైన్డ్ భూముల బాధిత రైతు కుటుంబాలు సంఘటితమై, మీ భూములను లాక్కోవడానికి వచ్చే ప్రభుత్వ అధికారులను,యంత్రాలను,వాటిని రక్షించే పోలీసులను ప్రతిఘటించండి.తద్వారా మీ భూములను మీరు కాపాడుకోగలరని,దానికి అసైన్డ్ భూముల పేదలు సిద్ధం కావాలని” తెలంగాణ మట్టిమనిషి ఉద్యమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వేనేపల్లి పాండురంగారావు అన్నారు.
సోమవారం చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలోని పిట్టంపల్లి కమాన్ వద్ద భూపోరాట కమిటీ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిర్వహించబడుతున్న నిరాహారదీక్షలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.అనంతరం పీఆర్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మాట్లాడుతూ 300 ఎకరాల అసైన్డ్ భూములకు బహిరంగ మార్కెట్ రేటైనా ఇవ్వాలి లేదా ఇండస్ట్రియల్ పార్కునైనా రద్దు చేయాలని అన్నారు.
ఈ దీక్షల్లో భూపోరాట కమిటి నాయకులు మేడి శంకర్ మాదిగ,అంశాల సత్యనారాయణ,సామ రామిరెడ్డి,బొడ్డుపల్లి శ్రీనివాస్,గుఱ్ఱం వెంకటేశ్,మెట్టు శ్రీశైలం,మారయ్య,మేడి రాములు,మేడి ముత్యాలు, శివప్రసాద్ గౌడ్ మరియు మహిళలు పాల్గొన్నారు.