F2 సూపర్ సక్సెస్ అవడంతో F 3 సినిమా చేసిన అనీల్ రావిపుడి దీనికి కొనసాగింపు ఉంటుందని అన్నారు.F4 సినిమా కూడా ఖచ్చితంగా వస్తుంది కానీ అది ఇప్పట్లో ఉండదని మాత్రం చెప్పేశాడు డైరక్టర్.రీసెంట్ గా ప్రముఖ ఛానెల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్న అనీల్ రావిపుడి ఎఫ్4 సినిమా పక్కాగా ఉంటుందని అయితే అందులో హీరోలు వాళ్లే ఉంటారు కానీ హీరోయిన్స్ మాత్రం మారే అవకాశం ఉందని అన్నారు.అంతేకాదు F4లో కొత్త పాత్రలు యాడ్ అవుతాయని చెప్పుకొచ్చారు.
F4లో కూడా వెంకటేష్, వరుణ్ తేజ్ లు ఉంటారని.వీరికి తోడుగా మరో స్టార్ నటించే ఛాన్స్ ఉంటుందని అనీల్ రావిపుడి చెప్పారు.
అయితే హీరోలు వాళ్లే ఉంటారు కానీ హీరోయిన్స్ మాత్రం మారుతారని హింట్ ఇచ్చాడు.ప్రాంచైజీ సినిమాల విషయంలో ఈ కాస్టింగ్ సమస్య ఎప్పుడూ ఉంటుంది.F2, F3 వరకు బాగానే కొనసాగించినా F4 కి మాత్రం ఫీమేల్ క్యాస్టింగ్ లో మార్పులు జరుగుతాయని తెలుస్తుంది.అయితే F4 ఆలోచన ఉన్నా ఇప్పుడప్పుడే అది సెట్స్ మీదకు వెళ్లదని క్లారిటీ ఇచ్చారు అనీల్ రావిపుడి.
తన నెక్స్ట్ సినిమా బాలకృష్ణతో ఉంటుందని.అది మాత్రం పక్కా కమర్షియల్ మూవీగా ఉంటుందని చెప్పుకొచ్చారు అనీల్ రావిపుడి.







