రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మైనర్ బాలిక రేప్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని శనివారం నాడు రాష్ట్ర సీఎస్, డీజీపీలను గవర్నర్ ఆదేశించారు.
గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినపుడు గవర్నర్ నివేదిక కోరినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు.ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది.
ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో గవర్నర్ కు ఉన్న విశిష్ట అధికారాలు ఏంటనే చర్చ మొదలైంది.కొన్నాళ్ళుగా గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య విభేదాలు తీవ్ర మవుతున్నాయి.
ప్రతి విషయంలోనూ గవర్నర్ పట్ల ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.తాజా ఘటన నేపథ్యంలో కూడా గవర్నర్ ఆదేశాలను అధికారులు పట్టించుకోవడంలేదు.
మరో వైపు ప్రభుత్వ అసమర్థతను ఎత్తి చూపితే కేసులు పెడుతున్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ ప్రశ్నించినవారి మీద కేసులు పెట్టి వేధిస్తూనే ఉన్నారు.తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీద కేసు పెట్టాలని పోలీసులు నిర్ణయించారు.ఆయనేమీ నేరం చేయలేదు.
మైనర్ బాలిక రేప్ కేసులో నిందితుల నేరాన్ని బహిర్గతం చేయడమే ఆయన చేసిన పాపం.కేసులో ఎవరైతే లేరని పోలీసులు చెబుతున్నారో…వారు ఉన్న వీడియో, ఫోటోలు రఘునందన్ రావు మీడియాకు విడుదల చేశారు.
దీంతో ప్రభుత్వానికి ఆగ్రహం తన్నుకు వచ్చింది.మైనర్ బాలికకు సంబంధించిన వీడియోను ఎలా బయటకు విడుదల చేస్తారంటూ ప్రశ్నిస్తోంది.
రఘునందన్ సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘించారని చెబుతున్నారు.బీజేపీ ఎమ్మెల్యే మీద కేసు ఎలా పెట్టాలన్న దానిపై న్యాయ నిపుణులతో పోలీసులు చర్చిస్తున్నట్లు సమాచారం.
బాలిక రేప్ కేసుపై నివేదిక కోసం గవర్నర్ ఆదేశించి 48 గంటలైనా సీఎస్, డీజీపీ నివేదిక ఇవ్వలేదు.గవర్నర్ గడువు ముగియడంతో గవర్నర్ అధికారాలపై మరోసారి చర్చిస్తున్నారు.ప్రశ్నిస్తే తెలంగాణ సర్కార్ కేసులు పెడుతున్నారు.







