నల్లగొండ జిల్లా:సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు.ఆదివారం నల్లగొండ జిల్లా దేవరకొండ క్యాంపు ఆఫీస్ లో పలు గ్రామాలకు చెందిన 173 మంది బాధితులకు రూ.30 లక్షల విలువగల సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేశారు.
సీఎం సహాయనిధి పథకం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా సంక్షోభ సమయంలో ప్రజలకు ఆశా కిరణంగా ఉంటుందన్నారు.
ప్రజల అవసరాలను గుర్తించి తక్షణ సహాయం అందించే ఈ విధానం రాష్ట్రంలోనే ప్రత్యేకమైనదన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అలివేలు,పిఎసిఎస్ చైర్మన్ వేణుధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.