నల్లగొండ జిల్లా:నకిరేకల్ పట్టణంలోని ఫైర్ స్టేషన్లో ఫైర్ ఇంజన్ కు నీళ్లు కరువయ్యాయి.బుధవారం ఫైర్ స్టేషన్లో బోరు పనిచేయకపోవడంతో ఇటుకల కంపెనీ వారికి డబ్బు చెల్లించి ట్యాంకు ఫుల్ చేస్తున్నామని ఫైర్ సిబ్బంది తెలిపారు.
అసలే ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫైర్ స్టేషన్లో బోరు రిపేరు చేసి ప్రజలకు ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.