నల్లగొండ జిల్లా:మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జడ్చర్ల శాసన సభ్యులు అనిరుధ్ రెడ్డితో కలిసి బుధవారం శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది కార్మికులు సురక్షితంగా తిరిగి రావాలని వేడుకున్నట్లు చెప్పారు.
లక్షలాది మంది రైతులు,ఫ్లోరైడ్ భాదితుల జీవితాలను మార్చే టన్నెల్ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రాజెక్ట్ పనులు కొనసాగాలని ఆ దేవదేవుణ్ణి వేడుకున్నానన్నారు.