చిట్యాల రైల్వే స్టేషన్ లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని వినతి

నల్లగొండ జిల్లా:దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ గురువారం ఉదయం తన అధికార గణంతో చిట్యాల రైల్వే స్టేషన్ వద్దకు రాగా పీఆర్ పీఎస్ ఆధ్వర్యంలో వివిధ అంశాలతో కూడిన వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మాట్లాడుతూ చిట్యాల రైల్వే స్టేషన్ లో నారాయణాద్రి,శబరి,ఫలక్‌నుమా,జన్మభూమి, శబరి ఎక్స్‌ప్రెస్ లు వచ్చేవీ,వెల్లేవి రెండు మార్గాల్లో కూడా ప్రయాణీకుల సౌకర్యార్ధం ఆపాలన్నారు.

 Request To Stop Express Trains At Chityala Railway Station-TeluguStop.com

స్టేషన్ ను కుడి ఎడమల ఇరువైపులా ప్లాట్ ఫారం నిర్మించి విస్తరించాలన్నారు.హైవేనుండి స్టేషన్ వరకు క్రాంతి వంతమైన లైట్లను ఏర్పాటు చేయాలని, ఉరుమడ్ల రైల్వే మార్గంలో ఫ్లై-ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని,స్టేషన్ లో ఆటో బైక్ స్టాండ్ ను ఏర్పాటు చేయాలని కోరారు.

సరైన చర్యలు తీసుకోకపోతే సికింద్రాబాద్ స్టేషన్ లో వారి కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పీఆర్ పీఎస్ నాయకులు ముప్పిడి మారయ్య,చిట్టిమళ్ళ శ్రవణ్ కుమార్,పోతెపాక విజయ్,జిట్ట యాదయ్య,వెంకన్న, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube