పుస్తకాల అమ్ముతున్న ప్రవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్

నల్లగొండ జిల్లా:ప్రభుత్వ నిబంధనలకు( Government regulations ) విరుద్ధంగా పుస్తకాలు,టై,బెల్ట్,యూనిఫామ్ అమ్ముతున్న ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం నల్గొండ( Nalgonda ) పట్టణంలో శ్రీ చైతన్య, స్రవంతి పాఠశాలలో పుస్తకాలు అమ్ముతున్న సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రత్యక్షంగా పట్టుకొని సీజ్ చేయించడం జరిగింది.

 Action Should Be Taken Against Private Schools Selling Books: Aisf , Government-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టానుసారంగా పుస్తకాలు అమ్ముతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని,ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బరిగల వెంకటేష్,జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వలమల్ల ఆంజనేయులు,ముదిగొండ మురళీకృష్ణ,పట్టణ కార్యదర్శి సూర్యతేజ, శివాజి,గణేష్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube