నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం ముందు ఓ గర్భిణీ కారులోనే ప్రసవం జరిగిన ఘటన సోమవారం వెలుగు చూసింది.కట్టంగూరు మండల కేంద్రానికి చెందిన పొలబోని శంకర్ తన భార్య స్వప్న పురిటి నొప్పులతో బాధపడుతుంటే కారులో నల్లగొండ మాతా శిశు హాస్పిటల్ కి తీసుకొచ్చాడు.
నొప్పులు ఎక్కువ కావడంతో ఆమె కారు దిగి ఆసుపత్రిలోకి నడవలేని పరిస్థితిలో బాధపడుతుంది.ఆ సమయంలో ఆసుపత్రికి సిబ్బంది రాకపోగా,వచ్చిన సిబ్బంది నిర్లక్ష్యంగా మొదటగా వీల్ చైర్ తీసుకొని వచ్చారు.
తీవ్రమైన పురిటి నొప్పులతో ఉన్న స్వప్న వీల్ చైర్ లో కూర్చునే పరిస్థితి లేకపోవడంతో నొప్పులు ఎక్కువై కారులోనే ప్రసవించి,బాబుకు జన్మనిచ్చింది.దాదాపు ఇరవై నిమిషాలు గడిచిన తరువాత ఆసుపత్రి సిబ్బంది స్ట్రెక్చర్ తీసుకొని వచ్చి బాలింతను, బాబుని హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లారు.
ఈ సీన్ చూసిన అక్కడున్న మిగతా గర్భిణీ స్త్రీలు వామ్మో ఈ హాస్పిటల్ ఇంత ఘోరమా అని భయబ్రాంతులకు గురవుతున్నారు.బాధిత స్వప్న భర్త శంకర్ మీడియాతో మాట్లాడుతూ అత్యవసరమైతే హాస్పిటల్ ముందు స్ట్రెక్చర్ కూడా లేదని, హాస్పిటల్ సిబ్బందికి అర్ధగంట నుండి చెప్పినా సహాయం చేయలేదని,తల్లి బిడ్డకు ఏమైనా అయితే మాత్రం ఈ హాస్పిటల్ బాధ్యత వహించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రికి రండని చెప్తారు,కానీ,తీరా వస్తే కనీస సౌకర్యాలు ఉండవని ఎన్నిసార్లు ఇలా పేషంట్లను ఇబ్బందికి గురి చేస్తారని మండిపడ్డారు.హాస్పిటల్ సూపరిండెంట్ వివరణ కోరగా ఇది అనుకోని సంఘటన.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మా సిబ్బంది పని చేస్తారు.ఇప్పటి నుండి హాస్పిటల్ ద్వారం ముందే స్ట్రెక్చర్,వీల్ చైర్‌ని ఏర్పాటు చేస్తాం.
అలాగే కారులో ప్రసవించిన స్వప్నకు,తన బాబుకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నాం.మా సిబ్బంది ఇరవై నాలుగు గంటల పాటు రోగులకు అందుబాటులో ఉంటున్నారు.