త్రాగునీరు లేక తల్లడిల్లుతున్న జి.యడవల్లి గ్రామస్తులు

నల్లగొండ జిల్లా( Nalgonda )రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ శుద్ది చేసిన మంచినీటిని సరఫరా చేస్తున్నామని చెబుతుంటే మరోవైపు అనేక గ్రామాల్లో దాహం తీర్చుకునేందుకు గుక్కెడు మంచి నీళ్ళు లేక ప్రజలు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి ఏర్పడింది.గత కొన్ని రోజులుగా గ్రామంలో మంచినీరు లేక అల్లాడుతున్న నేపథ్యంలో మంగళవారం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి ధర్నా దిగిన సంఘటన నల్లగొండ జిల్లా కనగల్ మండలం జి.

 Villagers Of G. Yadavalli Struggling For Drinking Water , Nalgonda , G. Yadavall-TeluguStop.com

యడవల్లి (G.Yadavalli ) గ్రామంలో వెలుగు చూసింది.ఈ సందర్భంగా మహిళలు మాట్లడుతూవేసవి కాలం( Summer season )లో గ్రామంలో మంచినీరు లేక అల్లాడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నామని చెబుతున్న సర్కార్ మా గ్రామంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

గత కొన్ని రోజులుగా మంచిలేక పిల్లలు,వృద్దులు గొంతెండి పోయి గుక్కెడు నీళ్ళ కోసం అల్లాడుతుంటే గ్రామ పంచాయితీ పాలక మండలి పట్టించుకునే స్థితిలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్ దగ్గరకు వెళితే ఒక్కో వాటర్ క్యాన్ రూ.10 లతో కొనుగోలు చేస్తున్నా అందరికీ అందుబాటులో లేకుండా పోయాయని వాపోయారు.నీళ్ల కోసం మహిళలు రోడ్డెక్కిన సమయంలో అటు నుండి వెళుతున్న గ్రామ అధికార పార్టీ సర్పంచ్ ను మహిళలు నిలదీయడంతో సదరు సర్పంచ్ మహిళలతో వాగ్వాదానికి దిగడమే కాకుండా మంచినీటి కొరతను తీర్చేందుకు చర్యలు చేపడతామని చెప్పకుండానే వెళ్ళిపోవడం గమనార్హం.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామంలో ఏర్పడిన మంచినీటి కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube